అత్యద్భుతంగా విసిఐ “ద లెజెండ్” అంతర్జాతీయ సమావేశం – 2024 వాసవిక్లబ్స్ అధ్యక్షులుగా ఇరుకుళ్ల రామకృష్ణ – ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా శిద్దా సూర్యప్రకాశరావు.

వాసవి క్లబ్స్ అంతర్జా జాతీయ సంస్థ 2025వ సంవత్సరపు అంతర్జాతీయ అధ్యక్షులుగా తెలంగాణా రాష్ట్రం భువనగిరికి చెందిన ఇరుకుళ్ల రామకృష్ణ, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా శిద్ధ సూర్యప్రకాష్ రావులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రవిచంద్రన్ సభాసదుల కరపతాళ ద్వనుల మధ్య ప్రకటించారు. సంస్థ ఎన్నికల నిర్వహణాధికారులుగా సంస్థ పూర్వ అంతర్జాతీయ అధ్యక్షులు ఆగిరి వేంకటేష్, నారాయణన్ ఆథికేశవన్, నూలి వేంకట రమణమూర్తి లు వ్యవహరించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తమిళనాడు రాష్ట్రంలోని మధురై నగరంలో టముక్కం కన్వెంషన్ సెంటర్ లో డిసెంబరు 14, 15 శని ఆదివారములలో 2024 విసిఐ అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ అధ్యక్షతన “ద లెజెండ్” పేరిట జరిగిన అంతర్జాతీయ సర్వసభ్య సమావేశము అత్యంత అద్భుతముగా సుందరముగా విశాలమైన వేదిక పై జరిగినది. ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుండి 6 వేలకు పైగా సభ్యులు విచ్చేశారు.

ఈ సంవత్సర కాలముగా విసిఐ స్ధానిక వాసవిక్లబ్స్ నిర్వహించిన సామాజిక సేవాకార్యక్రమాలు, సంస్థాగతంగా సాధించిన విజయాలను క్రోడీకరించి సభ్యులను అభినందించే కార్యక్రమం సభ్యుల కరతాల ధ్వనుల మధ్య జై వాసవి జై జై వాసవి నినాదాల మధ్య జ్ఞాపికలు అందించి సత్కరించారు. అనంతరం సంస్థ నిర్వహించిన ప్రతిష్టాత్మక కార్యక్రమాల ప్లకార్డు పట్టుకొని భక్తి గీతాలతో కొందరు రాజా సినిమా పాటలు బ్యాక్ గ్రౌండులో వినిపిస్తుండగా వాసవి క్లబ్ జిల్లాల గవర్నర్ల నేతృత్వములో బ్యానర్ ప్రజెంటేషన్ కనుల పండుగగా సాగింది.

కార్యక్రమానికి ముందుగా అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ సతీసమేతంగా అంతర్జాతీయ కార్యదర్శి హెచ్ ఎస్ నాగభూషణ సారధికాగా రధముపై కేరళ వాయిద్యములు మ్రోగుచుండగా… కోలాహలముల మధ్య మధురమీనాక్షి ఆలయ గోపుర అలంకరణలోని కన్వెంషన్ కు విచ్చేశారు. సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన వాసవి పతాకను ఆవిష్కరించారు. హీలియం బెలూన్లను ఎగుర వేశారు. కపోతాలను విశ్వంలోకి విడుదల చేశారు. అనంతరం వాసవిమాత ప్రార్ధన గీతం పాడి, అందరిచే సంస్థ ప్రతిజ్ఞను చేయించారు. తమ అధ్యక్షోపన్యాసములో సంస్ధను బలోపేతం కొరకు చేసిన మార్పులు, నియమావళి, ఒక్కరోజులో కోటి సీడ్ బాల్స్ తయారిలో సాధించిన ఎలైట్ వరల్డ్ రికార్డ్, రక్త సేకరణ, పేద మహిళల ఉపాధి కల్పనలో పంపిణి చేసిన కుట్టు మిషన్లు, లీప్ ఇయర్ లో సేవచేయడానికి మరో రోజు చేరిందని ప్రతి సభ్యుడు పేదలకు సమర్పించిన ఒక కేజి బియ్యం, టాక్స్ ఎగ్జంప్షన్ 18జి, 12ఎ, తిరుపతి క్షేత్రంలో ఎర్పాటు చేస్తున్న వాసవిక్లబ్స్ నిత్యాన్నదాన కార్యక్రమము మరియు తదితర విషయాలపై ప్రసంగించారు.

2025 అధ్యక్షులు ఇరుకుళ్ల రామకృష్ణ, శిద్దా వేంకట సూర్య ప్రకాశరావులు ప్రమాణ స్వీకారం చేశారు. రామకృష్ణ మాట్లాడుతూ “ఎలాంటి పొరపాటు లేకుండా మరింత ఉన్నత స్థానంలో వాసవి క్లబ్స్ ను నిలుపుతానని, తమ తప్పులు తెలిపిన వారిని తగు ఉన్నత స్థానంలో నిలుపుతానని హామి ఇచ్చారు. తమ కార్యదర్శులుగా గార్లపాటి శ్రీనివాసులు, బోడా సూర్య ప్రకాశ్… కోశాధికారిగా సుజాత రమేష్ లను ఎంపిక చేసినట్లు తెలిపారు. 2025 కార్యక్రమసూచి లైన హ్యుమానిటి, కమ్యూనిటి లను వివరించారు.

తదుపరి సంస్థ తరపున శిద్దా హనుమంతరావు, రామరాజ్, గోపాల్ పండ్లపొడి, హోమియో కేర్ ఇంటర్నేషనల్ సంస్థల అధినేతలకు జీవన సాఫల్య పురస్కారాలను అందించించారు. క్లబ్ గవర్నర్లు, అధికారులు, స్థానిక అధ్యక్షులను జ్ఞాపికలతో సత్కరించారు. సమావేశమునకు ముందు చిన్నారుల నృత్య ప్రదర్శన, సమావేశం అనంతరం తారాజువ్వల మెరపులు సభాసదులను ఆకట్టుకొన్నాయి. రెండురోజుల అంతర్జాతీయ కాన్వకేషన్ అనంతరం మధుర సృతులను ప్రోదిచేసుకొని తిరుగుప్రయాణం అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *