మేమంతా ఒక్కటే అని కొత్త …పాతల విభేదాలు ఏవి లేవని …తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి, పార్టీ జిల్లా సమన్వయ కార్యదర్శి మానం రమేష్ బాబు, రాష్ట్ర మైనార్టీ మైనార్టీ సెల్ కార్యదర్శి షేక్ పెద కాలే షా (బడే) అన్నారు. ఎంపీపీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు మాట్లాడుతూ పార్టీ దర్శి నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి లలిత్ సాగర్ ల ఆదేశాల మేరకు నడుచుకుంటూ పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తున్నామని అన్నారు. టిడిపిలో అన్ని క్యాడర్లో ఉన్న ప్రజాప్రతినిధులను… నాయకులను కలుపుకుంటూ వెళ్తున్నామని ఎక్కడ కూడా ఎటువంటి విభేదా లు లేవని అన్నారు. మండలంపై పూర్తి అవగాహన లేకుండా వార్తలు రాయడం.. తగదని అన్నారు.పార్టీ జిల్లా సమన్వయ కార్యదర్శి మానం రమేష్ బాబు మాట్లాడుతూ .. పార్టీలో ముందుగా క్షేత్రస్థాయిలో అవగాహన ఉన్న తర్వాత మాత్రమే వార్తలు రాస్తే బాగుంటుందని … ఒకే రీతిగా ఒక పార్టీకి అనుకూలంగా వార్తలు ప్రచురించడం జర్నలిజం కాదని హితవు చెప్పారు. మండల పార్టీ అధ్యక్షుడు బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ ఒక పార్టీకి అనుబంధంగా ఉన్న పత్రికలో ఇష్టాన్ని రీతిగా వార్తలు రాయటం తగదని… నిజా నిజాలు తెలుసుకొని స్థానిక జర్నలిస్టులు సమాచారం ఇవ్వాలని అన్నారు.
