ఏసు క్రీస్తు ప్రభువు వారు నేర్పిన సన్మార్గంలో నడిస్తే అందరి జీవితాల్లో వెలుగులు వీర జిమ్ముతాయని దళిత బహుజన రిసోర్స్ సెంటర్ రీజినల్ కో-ఆర్డినేటర్ దార్ల కోటేశ్వరరావు తెలియజేశారు. క్రిస్టమస్ పర్వ దినమును పురస్కరించుకొని తాళ్లూరు మండలం దారం వారి పాలెం ఎస్సీ కాలనీ నందు దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో క్రిస్టమస్ వేడుకలు నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా ఆర్.సి.యం చర్చ్ ఉపదేషకుడు గోపనబోయిన రోశయ్య దేవుని సందేశం ద్వారా మాట్లాడుతూ….. లోక రక్షకుడైన ఏసుక్రీస్తు చూపిన మార్గం లో ప్రతి ఒక్కరు ఆయన చూపిన శాంతి మార్గాన్ని, మానవాళి, అనుసరించాలి కుల,మతాలకు అతీతంగా జరుపుకుంటున్న క్రిస్టమస్ వేడుకలలో దేవుని ఆశీస్సులను పొందాలని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అందరికి పంపిణీ చేసి, తదుపరి 30 మంది వృద్ధు లు, వితంతువులకు దుప్పట్లు, స్వీట్స్ పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు ఆబోతు కొండయ్య , జి.నరేంద్ర, నూకతోటి సూరిబాబు, దార్ల మణిబాబు, గోపన్న అంజమ్మ తదితర గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

