వివాహ వార్షికోత్సవానికి వెళ్లి అంగలకుదిటి జగదీష్ ఆచార్యుని హఠాన్మరణం – డెహ్రాడూన్ లో దుర్ఘటన

వివాహ వార్షిక వేడుక.. ఆ కుటుంబంలో అంతులేని
విషాదాన్ని మిగిల్చింది. సుదూరంగా ఉన్న డెహ్రాడూన్లో తమ కళ్లముందే ఇంటి యజమాని హఠాన్మరణం చెందడంతో ఆప్తులు కన్నీరుమున్నీరయ్యారు. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తాళ్లూరుకు చెందిన అంగలకుదిటి జగదీష్ (59) విజయవాడలోని ఓ వెటర్నరీ కళాశాల లెక్చర్ గా పనిచేస్తూ
కుటుంబంతో సహా అక్కడే ఉంటున్నారు. ఏటా కుటుంబ సభ్యులతో ఇతర ప్రాంతాలకు వెళ్లి వివాహ వార్షికో త్సవం జరుపుకోవడం ఆయనకు ఆనవాయితీ. అందులో భాగంగా 31వ వార్షికోత్సవం జరుపుకునేందుకు మంగళవారం భార్య చంద్ర కళ, కుమార్తె అన్విత, మరో ఇద్దరు బంధువులతో కలసి ఉత్తరాఖండ్ లోని
డెహ్రాడూన్ కి తరలి వెళ్లారు. తర్వాత రోజు వివాహ వార్షి కోత్సవ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేసి మంగళవారం రాత్రి స్థానిక లాడ్జిలో కుటుంబ సభ్యులతో పాటు ఆయన నిద్రించారు. బుధ వారం ఉదయం భార్యకు మెలకువ వచ్చి.. పక్కనే ఉన్న భర్త జగ దీష్ ను నిద్ర లేపగా.. ఉలుకూ పలుకూ లేకపోవడంతో ఆందోళనకు గురై బంధువులను పిలిచారు. వారు వచ్చి పరిశీలించి గుండెపో టుతో మృతి చెంది ఉండొచ్చని చెప్పడంతో భార్య, కుమార్తె కన్నీరు మున్నీరయ్యారు. వివాహ వేడుక నిర్వహించుకోకుండానే తమ ప్రాంతానికి చెందిన వ్యక్తి మృతి చెందడంతో స్వగ్రామం తాళ్లూరులో విషాద ఛాయలు అలముకున్నాయి.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

లెక్చరర్ జగదీష్ (ఫైల్ ఫోటో)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *