నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎలాంటి అసాంఘిక అనుమతులు లేని కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు-జిల్లా ఎస్పీ ఏ. ఆర్ దామోదర్

ప్రజలందరూ బాధ్యతాయుతంగా బంధుమిత్రులతో కలసి ఆనందంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని, నూతన సంవత్సరంలో జిల్లా ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, సరికొత్త విజయాలను అందుకొని అందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని జిల్లా ఎస్పీ ఎ. అర్ దామోదర్ అన్నారు.
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎలాంటి అసాంఘిక, అనుచిత, అనుమతులు లేని కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నూతన సంవత్సర సంబరాల నేపథ్యంలో జిల్లాలో ఎక్కడ ఎలాంటి అవాంచనీయ ఘటనలు జగరకుండా పోలీస్ అధికారులు అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలి ఆదేశాలు జారీ చేశారు.న్యూ ఇయర్ వేడుకలు జరుపుకొనుటకు ప్రజలు ఎక్కువ సంఖ్యలో బహిరంగ ప్రదేశాలు, రోడ్డు కూడళ్ళలో గుమిగూడటం, బహిరంగంగా పార్టీలు, పెద్ద పెద్ద ధ్వనులతో లోడ్ స్పీకర్లు/డీజే లు పెట్టి ప్రజాశాంతికి, ప్రజా క్రమానికి భంగం కల్గించరాదు. హాస్పిటల్స్, వృద్ధాశ్రయాలు మరియు ఇతర సున్నితమైన ప్రాంతాల్లో పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్లు డీజేలు పెట్టరాదు. ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్ తీసేసి అధిక శబ్దాలతో ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, బైక్‌, కార్ రేసింగ్‌ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, సంబరాల పేరుతో రౌడీయిజం చేసినా, దురుసుగా ప్రవర్తించినా, బహిరంగ ప్రదేశాల్లో జన నివాస/సంచార ప్రదేశాల్లో మద్యం సేవించినా, మద్యం మత్తులో డ్రైవ్ చేసినా, ప్రజా రవాణాకు అడ్డంకులు సృష్టించేలా వాహనాలు నడపినా ఉపేక్షించేది లేదన్నారు. వైన్ షాపులు, బార్లు, రెస్టారెంట్లు, దబాలు మరియు ఇతర అవుట్ లెట్లు, వ్యాపార సముదాయాలను నిర్దేశిత సమయాల్లో మూసివేయాలి లేనిచో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, డ్రంక్ & డ్రైవ్ పై ప్రత్యేక దృష్టి చేపట్టామని, అధిక మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పట్టుబడిన వ్యక్తులపై కేసు నమోదు చేసి వారి వాహనాలు సీజ్ చేయటం జరుగుతుందన్నారు.జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ డి ఎస్ పి ల పర్యవేక్షణలో అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో డిసెంబర్ 31వ తేది సాయంత్రం నుండి అన్ని ముఖ్య కూడళ్ళలో పోలీస్ పికెట్స్, నైట్ గస్తీ బృందాలను వుంచి నూతన సంవత్సర వేడుకలలో ఎటువంటి అవాంచనీయ ఘటనలు, రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూసేలా నిరంతర పోలీసు నిఘా ఉంటుందని, డ్రంక్ అండ్ డ్రైవ్ పై ప్రత్యేక దృష్టి చేపట్టి వాహనాలు తనిఖీలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. కావున ప్రజలు గమనించి స్థానిక పోలీసులకు సహకరించాలని, ఎవరైనా మితిమీరి ప్రజా జీవనానికి, శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా కఠిన చర్యలు తీసుకోబడతాయని తెలియజేసారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *