ల్లా మరింత అభివృద్ధి సాధించేలా అధికారులందరూ సమన్వయంతో, పరస్పర సహకారంతో పనిచేయాలి – జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా

ఈ 2025వ సంవత్సరంలో జిల్లా మరింత అభివృద్ధి సాధించేలా అధికారులందరూ సమన్వయంతో, పరస్పర సహకారంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. నూతన సంవత్సర ఆరంభాన్ని పురస్కరించుకొని వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ లోని పలు విభాగాల ఉద్యోగులు గురువారం ప్రకాశం భవనములో కలెక్టరును మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ ను కలిసిన వారిలో కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి, జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ , డి.ఆర్.ఓ. బి.చిన ఓబులేసు, మార్కాపురం సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట్ త్రివినాగ్, ఒంగోలు ఆర్డిఓ కె.లక్ష్మీప్రసన్న, కనిగిరి ఆర్డిఓ కేశవర్ధన్ రెడ్డి, ఇతర అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, చీమకుర్తిలోని బధిరుల పాఠశాల విద్యార్థులు, పలు ఇతర పాఠశాలల విద్యార్థులు ఉన్నారు. అధికారులు తెచ్చిన కేకును కలెక్టర్ కట్ చేశారు. ఒంగోలు ఆర్డీవో, కలెక్టరు ఈ సందర్భంగా పరస్పరం కేకు తినిపించుకున్నారు. జాయింట్ కలెక్టర్ ను కూడా ఆయన చాంబర్లో వివిధ శాఖల ఉన్నతాధికారులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *