పోలీస్ నియామక ప్రక్రియలో భాగం గా మహిళ కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన జిల్లాలోని అభ్యర్థులకు శనివారం ఉదయం 5 గంటల నుండి ఒంగోలు పోలీసు కవాతు మైదానంలో దేహదారుఢ్య పరీక్షలు (పీఎంటీ, పీఈటీ) పరీక్షలు నిర్వహించారు. ఐదువ రోజు 455 మంది మహిళ అభ్యర్థులకు గాను 221 మంది హాజరయ్యి పాల్గొనగా, వీరిలో 114 మంది తదుపరి వ్రాత పరీక్ష కు అర్హత సాధించారు.
జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ ……..ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సూచించిన నియమాల ప్రకారం ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పకడ్బందీగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను నిర్వహించినట్లుగా పేర్కొన్నారు. పూర్తి సాంకేతిక పరిజ్ఞానంతో, పారదర్శకంగా సీసీ కెమెరాల నిఘాలో, జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది, సాంకేతిక నిపుణుల సహకారంతో నిర్వహిస్తున్నామన్నారు. మొదట మహిళ అభ్యర్థుల సర్టిఫికెట్స్ పరిశీలించాక బయోమెట్రిక్స్, ఫిజికల్ మెజర్‌మెంట్స్ తీసుకుంటారని, పరీక్షలలో భాగం గా 1600మీటర్లు, 100మీటర్ల పరుగు, లాంగ్ జంప్ పరీక్షలు నిర్వహించమని, ఎటువంటి పొర పాట్లకు తావులేకుండా ఆధునిక ఆర్‌ఎఫ్‌ఐడీ కంప్యూటరైజ్డ్ టెక్నాలజీతో పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. దేహడారుఢ్య పరీక్షలకు అభ్యర్తులు వెరిఫికేషన కోసం ఒరిజిన ల్ ధ్రువపత్రాలతో రావాలన్నారు. అభ్యర్థుల కొరకు వైద్య శిబిరం, మంచినీరుతో పాటు అవసరమైన అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేశామన్నారు.
డబ్బు చెల్లిస్తే ఉద్యోగం ఇస్తామని నమ్మబలికే దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని, కానిస్టేబుల్ ఉద్యోగం కేవలం ప్రతిభ మరియు సామర్ధ్యం ఆధారంగా మాత్రమే లభిస్తుందని, దేహదారుడ్య పరీక్ష ప్రక్రియ పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, ఎవరైనా ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మ బలికితే అలాంటి వారి సమాచారాన్ని పోలీసులకు తెలియచేయాలని విజ్ఞ్యప్తి చేశారు.
కానిస్టేబుల్ అభ్యర్థులందరికీ మనవి…….. శారీరక దేహదారుడ్య పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు వారి యొక్క ఆరోగ్య స్థితిగతులను ఆధారంగా చేసుకుని టెస్టులకు హాజరవ్వాలని,అలాగే ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండాలి.
ఈ ఈవెంట్స్ లో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, ఎఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, పిటిసి డిఎస్పీ మాధవ రెడ్డి, ఎఆర్ డిఎస్పీ శ్రీనివాసరరావు, పిటిసి డిఎస్పీ లక్ష్మణ్ కుమార్, డీపీఓ AO రామ్మోహన్ రావు, ఐటి కోర్ సీఐ వి.సూర్యనారాయణ, ఆర్ఐ లు, డీపీఓ సిబ్బంది,మెడికల్ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.




