సామాజిక సేవతో సంతోషం, తృప్తి పొందుచున్నాము – ఫామిలి క్లబ్ అధ్యక్షులు పొట్టి వీరా రాఘవరావు – నిరంతర సేవలలో ఫామిలి క్లబ్ 40వ మాస కార్యక్రమం.

సమాజంలోని అట్టడుగు వర్గాలకు, అనాధలకు, అభాగ్యులకు చేతనైనంత సాయం చేయడం ఎంతో తృప్తినిస్తుందని, సమాజానికి కొంత తిరిగివ్వడం మరింత ఆనందాన్నిస్తుందని ఫ్యామిలీ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు పొట్టి వీర రాఘవరావు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తమ ఫ్యామిలీ క్లబ్ నిరంతర నిర్విరామ 40వ మాస సేవా కార్యక్రమంలో భాగంగా 16వ తేదీ ఆదివారం ఉదయం స్థానిక హౌసింగ్ బోర్డ్ లోని బొమ్మరిల్లు అనాధ పిల్లల ఆశ్రమంలో 70 మంది అనాధ పిల్లలకు స్పోర్ట్స్ డ్రెస్ పంపిణీ చేశారు. అల్పాహారాన్ని, పండ్లు మరియు ఆశ్రమంలో ఉంటూ పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు విద్యాసామగ్రి ఎగ్జామ్ పాడ్స్, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. మరియు అదే వేదికపై స్థానిక బలరాం కాలనీలోని ఉషోదయ వృద్ధుల ఆశ్రమంలో ఉంటున్న పేద వృద్ధ మహిళామూర్తులకు చీరలు మరియు వృద్దాశ్రమానికి నెలకి సరిపడా నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. అనంతరం గో సేవలో భాగంగా మడనూరులోని గో శాలకు పశువుల దాన పంపించారు.

కార్యక్రమంలో ఫ్యామిలీ క్లబ్ అధ్యక్షులు పొట్టి వీర రాఘవరావు, పి. విజయ్ కృష్ణ, శిఘాకొల్లి ఫణిరాజ్, తాళ్ళూరి శ్రీను, టి. పాండురంగారావు, బైసాని శ్రీనివాసరావు, బివికే రమేష్, కే చంద్ర మౌళి, నూకల వేంకటేశ్వర గుప్తా, తుమ్మ పూడి సత్యనారాయణ, ఆర్ఎస్ ఫాషన్స్ శ్రీనివాసరావు, బొమ్మరిల్లు నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *