కంటోన్మెంట్ నియోజకవర్గం
6 వ వార్డు, టెంపుల్ రాక్ ఎన్ క్లేవ్ కాలనీలో 37.6 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్ లైన్ పనులకు సోమవారం ఎమ్మెల్యే శ్రీగణేష్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మమాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఈ ప్రాంతానికి ఎంపీగా పని చేసినందు వల్ల ఆయనకు నియోజకవర్గం పై అవగాహన ఉందని అందుకే
నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిస్థాయిలో సహకారం అందిస్తున్నారన్నారు.తను అన్ని శాఖల మంత్రులతో సమన్వయం చేసుకుంటూ నిధులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నానని ఎమ్మెల్యే అన్నారు. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కోసం సేకరిస్తున్న రక్షణ శాఖ భూములకు ప్రత్యామ్నాయంగా ఇస్తున్న 303 కోట్ల రూపాయలను కూడా సెంట్రల్ పూల్ కి కాకుండా కంటోన్మెంట్ కి కేటాయించేలా ముఖ్యమంత్రి రక్షణ శాఖతో మాట్లాడారన్నారు. ఎన్నికల సమయంలో పార్టీలో ఆరోపణలు చేసుకున్నా ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ మురుగేషన్, రాష్ట్ర మాజీ మంత్రి వేణుగోపాల చారి, కంటోన్మెంట్ బోర్డ్ నామినేటెడ్ మెంబర్ జే. రామకృష్ణ , సదా కేశవరెడ్డి స్థానిక కాంగ్రెస్ నాయకులు మరియు బిజెపి నాయకులు పాల్గొన్నారు.


