ప్రధాని విశ్వకర్మ యోజన పథకం కులవృత్తులవారి జీవితాలలో వెలుగులు నింపుచున్నది – బిజేపి మహిళామోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బి. విజయరావు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపట్టిన పథకాలలో “ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన” పథకానికి ప్రజలనుండి విశేష స్పందన వచ్చినది. దానికి తగ్గట్టుగానే ప్రభుత్వం కూడా వివిధ కుల వృత్తుల వారికి వారు జీవిస్తున్న కుల వృత్తులలో మరింతగా రాణించడానికి సాంకేతికంగా, మరియు నూతన యంత్రాలను ఎలా ఉపయోగించాలి అని వారికి కొంతకాలం పాటు తర్ఫీదు ఇచ్చి వారు ఆర్థికంగా బలోపేతం అవడానికి బ్యాంకర్స్ తో తక్కువ వడ్డీతో ఋణము అందించడం జరుగుతుంది. ఆ పెట్టుబడి తో వారు వ్యాపారాలను వృద్ధి చేసుకొంటూ ఎంతో నిలదొక్కుకొని మరింత ఆర్ధికముగా చేస్తున్న వృత్తిలో సంపూర్ణమైన సంతోషాన్ని పొందుచున్నారు. వారి నూతన పరిణితి చెందిన వ్యాపార విధానంతో వచ్చిన మార్పుతో వారి జీవన విధానంలో అనూహ్యమైన అభివృద్ధి చెందుతున్నారని బిజేపి మహిళామోర్చా జిల్లా ప్రధానకార్యదర్శి బి. విజయరావు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఆదివారం బిజేపి మహిళామోర్చా జిల్లా ఇంచార్జి తీగల సత్యవతితో కలసి విశ్వకర్మ యోజన పథకం ద్వారా తర్ఫీదు పొంది ఆర్ధిక పురోభివృద్ధి పొందిన లబ్ధిదారులు యర్రగుంట్ల ఇజ్రాయేలు, జయమ్మలను కలశారు. వారి జీవన గమనంలో వచ్చిన మార్పులను, పథకం ద్వారా పొందిన తర్ఫీదు వారికి ఎంతవరకు ఉపయోగపడుచున్నాయన్న విషయమును అడిగి తెలుసుకొన్నారు.

ఈ సందర్భంగా బి విజయ రావు మాట్లాడుచూ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద కుమ్మరి, కమ్మర, మేదర, వడ్రంగి, చర్మకార, భవన నిర్మాణ, నాయి బ్రాహ్మణ, రజక, స్వర్ణకార, దర్జీ, మత్య మరి తదితర 18 రకాల సంప్రదాయ వృత్తులవారికి, వెనుకబడిన వర్గాలవారు లబ్ధి పొందేలా కేంద్ర ప్రభుత్వం వారివారికి తగ్గట్లుగా ట్రైనింగ్ ఇస్తూ, స్వంతంగా వ్యాపారం చేసుకొనుటకు బ్యాంకులద్వారా మూడు లక్షల రూపాయల వరకు ఋణాలు అందిస్తున్నారని, కావున ఎవరైతే తమకాళ్లపై తాము నిలబడటానికి ప్రయత్నిస్తున్నారో ఆ 18 రకాల కులవృత్తులవారు ఈ పథకమునకు పేరు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *