కొర్ర పాటి వారి పాలెం మాజీ సర్పంచి కొర్ర పాటి లక్ష్మి నారాయణ (67) ఆదివారం మృతి చెందారు. ఆయన గత కొంత కాలం నుండి అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన 2006 నుండి 11 మధ్య కాలంలో సర్పంచిగా పనిచేసారు. నాటి ఎమ్మెల్యేలు డాక్టర్ బూచేపల్లి సుబ్బా రెడ్డి, డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డిల సహకారంతో గ్రామంలో అభివృద్ధిబాటలు వేసారు. ఆయనకు భార్య, ఇరువురు కుమారులు, కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతి పట్ల దర్శినియోజక వర్గ టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. లిలిత్ సాగర్ లు ఫోన్ లో కుటుంబసభ్యులను పరామర్శించారు. సర్పంచిల సంఘం అధ్యక్షుడు మారం ఇంద్ర సేనా రెడ్డి[మాజీ ఎంపీపీలు పోశం మధుసూధన రెడ్డి, గోళ్ల పాటి మోషే, ఐవీ సుబ్బా రెడ్డి, మాజీ సర్పంచి నరసింహా రావు, రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి గొల్లపూడి వేణు బాబు, టిడిపి మండల అధ్యక్షుడు బొమ్మి రెడ్డి ఓబులు రెడ్డి, మానం రమేష్, సురేంద్ర మోహన్, సాగర్ తదితరులు ఆయన మృత దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
