శిక్షణలో నేర్చుకున్న విషయాలను చిన్నారులకు ఉపయోగించాలి

శిక్షణలో నేర్చుకున్న విషయాలను చిన్నారుల అభివృద్ధికి ఉపయోగించాలని సీడీపీఓ సిహెచ్ భారతి, వికే ఉన్నత పాఠశాల హెచ్ఎం, కోర్సు డైరెక్టర్ శేష గిరి లు అన్నారు. స్థానిక వికే ఉన్నత పాఠశాలలో అంగన్ వాడీ టీచర్లకు జ్ఞాన జ్యోతి కార్యక్రమంలో ఆరు రోజుల పాటు ఇచ్చిన శిక్షణ కార్యక్రమం మంగళవారం ముగిసింది. శిక్షణలో నేర్చుకున్న విషయాలు చిన్నారుల మానసిక, మోధో, భాషా, సామాజిక, సాంస్కృతిక, సౌదర్య, సృజనాత్మకత, శారీరకంగా దృఢంగా అభివృద్ధి చెందేలా ఉపయోగించాలని కోరారు. టీ ఎల్ ఎం ను ఉపయోగించి చిన్నారులకు నేర్పించాలని కోరారు. గ్యాడ్యుయేషన్ డే ను నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్ వైజర్ జ్యోతి, కోర్సు డైరెక్టర్ శేష గిరి, డిఆర్పీలు జీవి శివ రామి రెడ్డి, శ్రీమన్నారాయణ, చంద్రిక పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *