జేఈఈ మెయిన్స్ రెండో పేపర్ పరీక్షా ఫలితాల్లో 99.94 పర్సంటైల్ తో ఆల్ ఇండియా స్థాయిలో ఎస్సీ కేటగిరీలో ప్రథమస్థానంలో నిలిచిన ఒంగోలులోని శ్రీసరస్వతి విద్యాసంస్థల విద్యార్థి కసుకుర్తి లోక్ క్రిటి ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అభినందించారు. లోక్ క్రిటి జేఈఈ మెయిన్స్ లో టాపర్ గా నిలిచారు. కళాశాల చైర్మన్ ఏవి రమణారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వారిని అభినందించారు. సాధారణ విద్యార్థులతో అసాధార ఫలితాలు సాధించేందుకు కృషి చేసిన కళాశాల యాజమాన్యాన్ని సీఎం చంద్రబాబు మెచ్చుకున్నారు. ఫలితాలు సాధించేందుకు కృషిచేసిన కళాశాల డైరెక్టర్లు ఎ.గణేష్ రెడ్డి, ఎ.గంగా శంకర్ రెడ్డి, సీఈవో సురేష్ లను సీఎం చంద్రబాబు అభినందించారు.

