తాళ్లూరు మండల కేంద్రంలో బుధవారం ఇడమకంటి నాగి రెడ్డికి చెందిన బ్యారన్ దగ్ధం అయినది. తెల్లవారు జామున నాలుగు గంటల సమయంలో మంటలు చెలరేగటంతో పొగాకు మొత్తం దగ్ధం అయినది. మొత్తం రూ. 8 లక్షల విలువైన ఆస్థి నష్టం అయినట్లు బాధిత రైతు బంధువులు తెలిపారు. అద్దంకి అగ్ని మాపక సిబ్బంది సమాచారం ఇవ్వటంతో వచ్చి మంటలను అదుపు చేసారు.


