హైదరాబాద్ ,ఏప్రిల్ 13,(జే ఎస్ డి ఎం న్యూస్ ప్రధాన ప్రతినిధి):
నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ఇండియా జాతీయ కార్యదర్శిగా నగరానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ శశి బి.ఎస్.ఎస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్ లో జరిగిన ఎన్ యు జె సమావేశాల్లో ఎన్.యు.జె. (ఐ) నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. శశి ఎన్ యు జె జాతీయ కార్యదర్శిగా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం జరిగిన సభలో ఎన్ యు జె కి ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ అభినందించారు. శశి గతంలో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గానూ, ప్రస్తుతం జాప్ అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. అదేవిధంగా న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర శాఖ అధ్యక్షులు గా శశి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో లీడ్ ఇండియా పబ్లిషర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా కూడా శశి పనిచేశారు. ఇలా పలు కీలక బాధ్యతలను నిర్వర్తించి పాత్రికేయులు, ప్రింట్ మీడియా పబ్లిషర్ల సంక్షేమానికి శశి ఎంతగానో కృషి చేశారు. ఎన్ యు జె (ఐ) జాతీయ కార్యదర్శిగా ఎన్ని కావడం పట్ల శశి సంతోషం వ్యక్తం చేశారు. తనకు మరింత బాధ్యత పెరిగిందని చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా రంగాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు, ఫోటో, వీడియో జర్నలిస్టులు, ఇతర సిబ్బంది సమస్యల పరిష్కారానికి తన శాయశక్తుల కృషి చేస్తానని తెలిపారు. తనపై ఎంతో విశ్వాసం ఉంచి ఎన్ యు జె కార్యదర్శిగా ఎన్నుకున్న సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తనను అన్ని విధాలుగా ప్రోత్సహించిన జాప్ వ్యవస్థాపకులు ఉప్పల లక్ష్మణ్, రాష్ట్ర, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఇతర కార్యవర్గ సభ్యులకు శశి ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలియజేశారు.
