ప్రశాంత వాతావరణంలో గుంటి గంగ తిరునాళ్లను నిర్వహించుకోవాలని దర్శి డీఎస్పీ లక్ష్మి నారాయణ కోరారు. గుంటి గంగలో ఆదివారం తిరునాళ్ల సందర్భంగా విద్యుత్ ప్రభలను ఏర్పాటు చేస్తున్న పలు పార్టీలకు చెందిన నిర్వాహకులతో తాళ్లూరు ఎస్సై మల్లిఖార్జునరావు శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. దర్శి డీఎస్పీ లక్ష్మి నారాయణ, సీఐ రామారావులు ముఖ్య అతిథులు పాల్గొని తిరునాళ్ల సందర్భంగా ప్రభల నిర్వాహక కమిటీ సభ్యులు, రాజకీయ పార్టీల నాయకులు
అనుసరించాల్సిన విధానాల గురించి వివరించారు. పలు రాజకీయ పార్టీల నాయకులు,గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

