తాళ్లూరు మండలంలోని సోమవరప్పాడు పరిధి గుంటిగంగలో కొలువుదీరిన గంగాభవాని అమ్మవారికి ఆదివారం భక్తులు వెండి పాదాలను సమ ర్పించారు. తూర్పుగంగవరానికి చెందిన నేరెళ్ల సీతమ్మ కుటుంబ సభ్యులు రూ. యాభై వేలకుపైగా విలువైన వాటిని తీసు కొచ్చి ఆలయ ట్రస్టీ ఛైర్మన్ కొసనా గురు బ్రహ్మం, ఈవో జి.వాసుబాబులకు అందజేశారు. పూజారులు ప్రకాశరావు, కామే శ్వరశర్మలు వారికి వేదాశీర్వచనాలు అందజేశారు. మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మారం సుమన్, దేవాలయ ఆర్ఎ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

