బేగంపేట ఏప్రిల్ 14(జే ఎస్ డి ఎం న్యూస్) :
రాజ్యాంగ నిర్మాత,బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం కృషి చేసిన మహానుభావుడు,డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ 134 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా దళిత చైతన్య సంఘం ఆధ్వర్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో వికలాంగులకు ఉచితంగా వీల్ చైర్స్ ని సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ముప్పడి నవీన్ కుమార్ మాదిగ ఆధ్వర్యం లో పంపిణీ చేసారు. వింధ్య బులియన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కూడా నగరంలోని వివిధ ప్రాంతాల్లో అంబేద్కర్ జయంతిని ఘనంగా జరిపారు.ఈసందర్భంగా అన్నదానం చేశారు.అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ముప్పిడి నవీన్ కుమార్ మాదిగ మాట్లాడుతూ అంబేద్కర్ కలలుగన్న సమసమాజాన్ని సాధించుకుందామని అన్నారు.ఈ కార్యక్రమంలో వడ్ల రామాంజనేయులు, రవి ,అభిషేక్, దామ్, శేషు, వెంకట్ ,సుశీల్రాజ్, శిల్ప, శ్యామల రమణి తదితరులు పాల్గొన్నారు.



