బేగంపేట ఏప్రిల్ 27(జే ఎస్ డి ఎం న్యూస్):
తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నా రెడ్డి, వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ గోపీ (ఐఏఎస్), వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఓఎస్‌డీ శ్రీధర్ వాసిరెడ్డితో కలిసి జపాన్‌లోని ఒసాకా నగరంలో నిచినో రీసెర్చ్ సెంటర్‌ను ఆదివారం సందర్శించారు.ప్రపంచంలో ప్రముఖ అగ్రో కెమికల్ సంస్థలలో ఒకటైన నిచినో తమ పురోగతిని, పురుగుల మందులు, శిలీంధ్ర నాశకాలు, కల్మష నివారకాలు వంటి పరిశోధనలపై నూతన ఆవిష్కరణలను వివరించి, అత్యాధునిక సాంకేతికతతో నిర్మించిన వారి పరిశోధనా కేంద్రాన్ని ప్రదర్శించారు.డా. జి. చిన్నా రెడ్డి ప్రతినిధి బృందం డా. కజుహికో మోటోబాకి, డా. ప్రశాంత్ కి, నిచినో బృందానికి సాదర స్వాగతం పలికి విలువైన సమాచారం కోసం జపాన్పర్యటనకువచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం, నిచినో సంస్థతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం, వ్యవసాయ అభివృద్ధిని వేగవంతం చేయడం లక్ష్యంగా చిన్నారెడ్డి సారథ్యంలోని తెలంగాణ అధికారిక బృందం ముందుకు సాగుతోంది.

