పాకిస్తానీ పౌరులకు భారత ప్రభుత్వం జారీచేసిన అన్ని చెల్లుబాటు అయ్యే వీసాలు 2025 ఏప్రిల్ 27 నుంచి రద్దుకావడం జరిగిందని, జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఒక ప్రకటనలో తెలిపారు. పాకిస్తానీ పౌరులకు భారత ప్రభుత్వం జారీచేసిన వీసాలపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. ఈ నేపద్యంలో మెడికల్ వీసాలు, లాంగ్ టర్మ్ వీసాలు, దౌత్య మరియు అధికారిక వీసాలు మినహా అన్ని చెల్లుబాటు అయ్యే వీసాలు 27 ఏప్రిల్, 2025 నుంచి రద్దుకావడం జరిగిందని, ఈ సందర్బంగా భారత ప్రభుత్వం పాకిస్తానీ పౌరులకు వీసా సేవలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించడం జరిగిందని తెలిపారు. పాకిస్తానీ పౌరులకు జారీ చేయబడిన మెడికల్ వీసా 29 ఏప్రిల్, 2025 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయన్నారు. పాకిస్తానీ పౌరులకు జారీ చేయబడిన ధీర్ఘకాలిక వీసాలు, దౌత్య మరియు అధికారిక వీసాలకు వర్తించదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారన్నారు.
పాకిస్తానీ పౌరులకు భారత ప్రభుత్వం జారీచేసిన అన్ని చెల్లుబాటు అయ్యే వీసాలు రద్దు -జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా
29
Apr