కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రాయోజిత పథకాల లబ్ధిని అర్హులైన లబ్దిదారులకు అందేలా అధికారులు కృషి చేయాలి – రాష్ట్ర 20 సూత్రాల అమలు చైర్మన్ లంకా దినకర్

ప్రధాని నరేంద్ర మోడీ గారు, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సంకల్పించిన వికసిత భారత్-2047, స్వర్ణాంధ్ర- 2047 లక్ష్య సాధనలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రాయోజిత పథకాల లబ్ధిని అర్హులైన లబ్దిదారులకు అందేలా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర 20 సూత్రాల అమలు చైర్మన్ లంకా దినకర్ కోరారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రాష్ట్ర 20 సూత్రాల అమలు చైర్మన్ లంకా దినకర్, అధికారులతో సమావేశమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల అమలు తీరు, మౌలిక సదుపాయాలు కల్పనపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో త్రాగు, సాగు నీటి సమస్యతో పాటు ప్లోరైడ్ సమస్య అధికంగా ఉందని, ప్లోరైడ్ పీడిత జిల్లాల్లో ప్రకాశం జిల్లా ఒకటని అన్నారు. ఈరోజు మన జిల్లాకు త్రాగు నీరు మరియు ఫ్లోరిడ్ ప్రభావిత ప్రాంతాలలో సహాయం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మానసిక పుత్రిక పి4 స్ఫూర్తితో కొన్ని కేంద్ర ప్రభుత్వ మరియు ప్రైవేట్ వ్యాపార మరియు సేవా సంస్థలను తీసుకురావడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా అవసరమైన ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ఫ్లోరిడ్ సమస్యకు చరమగీతం పాడితేనే వికసిత భారత్ మరియు స్వర్ణఆంధ్ర లో ప్రకాశం జిల్లా భాగస్వామ్యం కాగలదని ఆయన తెలిపారు. జిల్లాలో ఉన్నటువంటి త్రాగు, సాగు నీటి సమస్యతో పాటు ప్లోరైడ్ సమస్య పరిస్థితులు, తీవ్రత ఏ విధంగా ఉంది, వాటి ప్రభావం ప్రజలపై ఏ విధంగా ఉంది, సహేతికంగా వివరిస్తూ, ఆయా సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై పూర్తీ స్థాయిలో నివేదిక, ప్రతిపాదనలు పంపాలని దినకర్, అధికారులను కోరారు. ఈ సందర్భంగా జిల్లాలో వున్నటువంటి త్రాగు నీటి సమస్య పై క్షుణ్ణంగా సమీక్షించి తగు సూచనలు చేసారు. అలాగే ప్లోరైడ్ సమస్య ప్రభావం జిల్లా లో ఎలా వుంది, ప్లోరైడ్ నివారణకు తీసుకుంటున్న చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ప్లోరైడ్ సమస్య నివారణకు రక్షిత మంచి నీటి ప్లాంట్స్ ఏర్పాటుకు, డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు సామాజిక భాద్యతతో కేంద్ర, ప్రభుత్వ మరియు ప్రైవేట్ వ్యాపార మరియు సేవా సంస్థలు ముందుకు వస్తున్నారని, కావున అధికారులు 2047 విజన్ ప్లాన్ ను దృష్టిలో ఉంచుకుని సంబంధిత సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై పూర్తి స్థాయిలో నివేదికలు సమర్పించాలన్నారు.
ఈ సమీక్షా సమావేశంలో ఆర్ డబ్ల్యూఎస్. ఎస్ఈ శ్రీ బాల శంకర రావు, డ్వామా పిడి జోసెఫ్ కుమార్, ఇరిగేషన్ ఎస్ఈ శ్రీమతి వర లక్ష్మి, పశు సంవర్ధక శాఖ జెడి డా. బేబి రాణి, డిసిహెచ్ఎస్ డా. శ్రీనివాస నాయక్, డిఎస్ఓ శ్రీమతి పద్మావతి, గ్రౌండ్ వాటర్ డిడి శ్రీ విద్యాసాగర్, పవర్ గ్రిడ్ ప్రతినిధి శ్రీ ఎం.ఎన్ రావు, జయప్రద ఫౌండేషన్, వీనస్ ఫౌండేషన్ ప్రతినిధులు రఘురామ్, ఇండో సెల్, లారస్ ఫార్మా కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *