దేశంలోకెల్లా పెద్ద మొత్తంలో సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ నే -ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తున్నాం -అన్ని వర్గాల సంక్షేమ కూటమి ప్రభుత్వ ధ్యేయం – అమరావతిలో నూతన అధ్యాయం ప్రారంభం -సీఎం చంద్రబాబు నాయుడి సమర్థవంతమైన నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయనిస్తోంది -మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి

ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, అన్ని వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి వుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. గురువారం ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊళ్లపాలెంలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి మంత్రి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం అదే గ్రామంలో రూ. 20 లక్షల నిధులతో నిర్మించిన బీచ్ సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ…కూటమి 10 నెలల పాలనలోనే రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. దేశంలోనే పెద్ద మొత్తంలో సామాజిక భద్రత పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే. ప్రతి నెలా రాష్ట్రంలో 63 లక్షల మందికి రూ. 2,717 కోట్లు, ప్రకాశం జిల్లాలో రూ. 2 లక్షల 83 వేల మందికి రూ.123 కోట్లు పంపిణీ చేస్తున్నాం. పింఛన్ రూ.200 నుంచి రూ.2 వేలకు, రూ.2 వేలను రూ.4 వేలకు పెంచిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుదే అని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తున్నాం. పింఛన్ రూ 4 వేలకు పెంచాం, మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. మత్స్యకారులకు వేట నిషేధ కాలభృతి రూ.10 వేల నుంచి రూ. 20 వేలకు పెంచాం. ఎస్సి, బీసీలకు ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షలు, ఎస్టీలకు రూ.3.25 లక్షలు ఇవ్వబోతున్నాం. చేపల చెరువుల రైతులకు రూ.1.50 పైసల సబ్సిడీకి విద్యుత్ ఇస్తున్నాం, మత్స్యకారులకు వలలు, డీజిల్ సబ్సిడీకి అందజేశాం. సోనా బోట్ల వివాదంలో తమిళనాడు ప్రభుత్వం ముందుకు వచ్చి అక్రమంగా ఏపీలోకి ప్రవేశించిన బోట్లపై కేసులు పెడతామని తెలిపిందని అన్నారు. ఇది కూటమి ప్రభుత్వం సాధించిన విజయమని మంత్రి చెప్పారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

శుక్రవారం నుంచి అమరావతిలో నూతన అధ్యాయం ప్రారంభమవుతుందని, ప్రధాని మోదీ అమరావతిలో వేల కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్నట్టు మంత్రి డోలా తెలిపారు. తెలుగువారు గర్వపడేలా అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతుందని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమర్థవంతమైన నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *