హైదరాబాద్,మే 3 (జే ఎస్ డి ఎం న్యూస్):
హైదరాబాద్ లో జరుగనున్న మిస్- వరల్డ్ పోటీల్లో పాల్గొననున్న వివిధ దేశాల సుందరీమణుల రాక ప్రారంభమయింది. ఈ మిస్ వరల్డ్ పోటీల కంటెస్టర్లు ఈ నెల 6 వ తేదీ నుండి హైదరాబాద్ కు చేరుకుంటారు. మిస్ కెనడా మిస్ ఎమ్మా డీయానా కాథరిన్ మోరిసన్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు శనివారం సాయంత్రం చేరుకున్నారు. శంషాబాద్ కు చేరుకున్న మిస్ కెనడా కు తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాల ప్రకారం అధికారులు ఘన స్వాగతం పలికారు.
