ప్రజావాణిలో 221 దరఖాస్తులు – దరఖాస్తులు స్వీకరించిన చిన్నారెడ్డి, దివ్య.

హైదరాబాద్ మే 9 (జే ఎస్ డి ఎం న్యూస్) :
మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 221 దరఖాస్తులు అందాయి.
వీటిలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 64, హోం శాఖకు సంబంధించి 10, రెవెన్యూ శాఖకు సంబంధించి 26, మున్సిపల్ శాఖకు 10, ఇందిరమ్మ ఇండ్ల కోసం 64, ప్రవాసి ప్రజావాణికు 01 దరఖాస్తులు వచ్చాయి. ఇతర శాఖలకు సంబంధించి 46 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు.
ప్రజావాణికి తరలివచ్చిన ల్యాబ్ టెక్నీషియన్స్ తమ సమస్యలను తెలుపగా వెంటనే సంబంధిత అధికారులతో చిన్నారెడ్డి ఫోన్ లో మాట్లాడి సమస్యను పరిష్కరించేలా చూడాలన్నారు.సీఎం ప్రజావాణి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ దరఖాస్తులు స్వీకరించి ప్రజల సమస్యలు విని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి పలు సమస్యలను  పరిష్కరించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *