ప్రజా సమస్యల పరిష్కార వేదిక” లో వచ్చే ఆర్జీల పై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి – జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ

ప్రజా సమస్యల పరిష్కార వేదిక” లో వచ్చే ఆర్జీల పై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ
అధికారులను ఆదేశించారు.
మంగళవారం ఒంగోలు కలెక్టరేట్ లోని మీ కోసం సమావేశ మందిరంలో నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాల క్రిష్ణ, జిల్లా రెవెన్యు అధికారి చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు పార్ధసారధి, వరకుమార్, కుమార్ లతో కలసి పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ద చూపాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ… పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అందిన వినతులను నాణ్యతతో సకాలంలో పరిష్కరించాలన్నారు. వివిధ శాఖల్లో నమోదైన అర్జీలను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారుని సమస్యకు తగిన పరిష్కారంచూపాలని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు. అర్జీల పరిష్కార ప్రగతిని ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయాలని జిల్లా జాయింట్ తెలిపారు. రీ ఒపెన్ దరఖాస్తు లపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *