జిల్లా ఎపీ మైనార్టీ కార్పోరేషన్ ఉత్తర్వుల మేరకు 2025-26 ఆర్థిక సంవత్సరంలో బుణాల మంజూరుకు అర్హలైన మైనార్టీ కులముల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్న తాళ్లూరు ఎంపీడీఓ దార హనుమంత రావు తెలిపారు. తాళ్లూరు మండలంలో బొద్దికూరపాడు, తూర్పుగంగవరం, తాళ్లూరు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, కెనరా బ్యాంకుల పరధిలో 14 యూనిట్లు మంజూరు కానున్నట్లు చెప్పారు. అందులో రూ. 10 లక్షలు సబ్సిడీతో రూ. 10 లక్షల బ్యాంకు రుణం వస్తుందని చెప్పారు. ఈనెల 25వ తేదీ లోపు ఆన్ లైన్ లో ఓ బి ఎం ఎం ఎస్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.
మైనార్టీ రుణాల మంజూరుకు దరఖాస్తు చేసుకోండి
13
May