ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ఆధరణ

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ఆదరణ లభిస్తుందని తాళ్లూరు మండల వ్యవసాయాధికారి ప్రసాద రావు అన్నారు. నాగంబొట్ల పాలెంలో మంగళ వారం రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగంలో వినూత్న మార్పులు వస్తూ నూతన హైబ్రీడ్ రకాలు అందుబాటులోనికి వచ్చాయని అన్నారు. మితి మీరిన రసాయనిక వాడకంతో దిగుబడులతో పాటు మార్కేట్లో గిరాకీ తగ్గుతుందని అన్నారు. ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు దృష్టి సారించాలని పెట్టుబడి తగ్గుటంతో పాటు మంచి దిగుబడులు, ఉత్పత్తులకు దిమాండ్ ఉంటుందని చెప్పారు. 2025 ఖరీఫ్ సాగుకు మరింత మంచి రైతులను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. 25 రకాల విత్తనాల కిట్స్ ప్రీ మాన్ సూన్ సోయింగ్ కిట్స్ను కొనుగోలు చేసి తొలకరిలో విత్తు కోవాలని కోరారు. రైతులకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ప్రకృతి సాగు చేసిన రైతులను సన్మానించారు. ప్రకృతి సాగు ఇన్చార్జి పి నరసింహులు, ఎంపీఈఓ దయా సాగర్, ఐసిఆర్పీలు వాణి కోటి రత్నం, అనంత లక్ష్మి , మౌనిక, పల్లవి లు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఫోటో 13–18 ర్యాలీలో పాల్గొన్న వ్యవసాయాధికారి, రైతులు, సిబ్బంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *