ప్రజల నుండి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులను పరిష్కారించుటయే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ , ఆర్ దామోదర్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్) నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో నలుదిక్కులా నుండి వచ్చిన పిర్యాదుదారులతో అధికారులు ముఖాముఖీగా మాట్లాడి వారి ఫిర్యాదుల గురించి వివరంగా అడిగి తెలుసుకుని ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, సత్వరం పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. అందిన ఆయా ఫిర్యాదుల గురించి సంబందిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి వెంటనే చట్ట ప్రకారం విచారణ జరిపి భాదితులకు సత్వరమే న్యాయం అందించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్కువగా భూ వివాదాలు, కుంటుంబ సమస్యలు, చీటింగ్ మరియు ఇతర సమస్యల గురించి ప్రజా పిర్యాదులు వచ్చాయి.
ఈ కార్యక్రమంలో మహిళా పియస్ డిఎస్పీ రమణ కుమార్, ఒంగోలు ట్రాఫిక్ సీఐ పాండు రంగారావు, సి . సిఎస్ ఇన్స్పెక్టర్ జగదీష్, ఎస్ . సి , ఎస్ . టి సెల్ ఇన్స్పెక్టర్ దుర్గ ప్రసాద్, డీటీసి ఇన్స్పెక్టర్ షమీముల్లా, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సై రజియా సుల్తాన్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.



