సహజ మరణాలను లాకప్ డెత్లుగా పేర్కొంటూ అసత్య కథనాలను వండి వార్చి వడ్డిస్తున్న పత్రికలు మరియు సోషల్ మీడియా ఖాతాలపై కఠిన చర్యలు – ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయం

ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్..? పేరిట అసత్య కథనాలను ప్రచారం చేస్తున్న వారిపై పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుంది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ప్రభుత్వాన్ని మరియు పోలీసు విభాగాన్ని అపఖ్యాతిపర్చే దురుద్దేశంతో పుకార్లు, అబద్ద ప్రచారాలు చేసే మీడియా సంస్థలపై మరియు సోషల్ మీడియా ఖాతాలపై కఠిన చర్యలు.

సహజ మరణాలను లాకప్ డెత్లుగా చేస్తున్న అవాస్తవ ప్రచారాలు ప్రజలను తప్పుదారి పట్టించడమే కాకుండా రాష్ట్రంలో శాంతి భద్రతలకు ముప్పుగా మారే ప్రమాదం ఉంది.

ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసు విచారణలో భాగంగా సంబంధించిన అనుమానితులను మరియు సాక్షులను చట్టబద్దంగా ప్రశ్నించడం జరిగింది. ఎవ్వరినీ అక్రమంగా నిర్బంధించటం గాని, లాకప్ హింసకు పాల్పడటం గాని జరుగలేదు. మృతుని కుటుంబ సభ్యులను, బంధువులను బెదిరించడం గాని, బలవంతం చేయడం గాని జరుగలేదు.

పారదర్శకంగా జరుగుతున్న కేసు దర్యాప్తులో ఇటువంటి అసత్య కధనాలు ప్రచురించటం అత్యంత దురదృష్టకరం.

వాస్తవాలకు విరుద్ధంగా, ప్రజలను తప్పుదోవ పట్టించేలా, పోలీస్ శాఖను అపఖ్యాతి పరిచే విధంగా కథనాలను ప్రచారం చేస్తున్న పత్రికలు, మరియు సోషల్ మీడియా ఖాతాలపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *