వైపీపీ పార్టీ ఈనెల 4న నిర్వహించ తల పెట్టిన వెన్న పోటు దినం కార్యక్రమాన్ని పార్టీ
నాయకులు, కార్యకర్తలు విజయవంతం చెయ్యాలని వైసీపి తాళ్లూరు మండల పార్టీ అధ్యక్షుడు టీవీ సుబ్బా రెడ్డి కోరారు. మండల పార్టీ కార్యాలయంలో సోమవారం వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేసినందుకు పార్టీ పిలుపు మేరకు వైసీపి జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి సారధ్యంలో దర్శిలో పార్టీ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించబడునని చెప్పారు. ప్రతి కార్యకర్త పార్టీ కార్యాలయం వద్దకు చేరుకుని కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని కోరారు. పలు గ్రామాల నర్పంచిలు కోట శివ వెంకట రామి రెడ్డి, వలి, ఎంపీటీసీ యామర్తి ప్రభుదాన్, మాజీ సోసైటీ అధ్యక్షుడు పులి ప్రసాద్ రెడ్డి, యాడిక యలమందా రెడ్డి, నాయకులు సంగు కొండా రెడ్డి, విష్ణు, పూనూరు దేవదానం , పులి రమణారెడ్డి , కటకంశెట్టి శ్రీనివాస రావు, గోపాల్ రెడ్డి, మల్లీశ్వర రెడ్డి, కోట మన్నే రెడ్డి, అర్జున్ రెడ్డి, శెట్టయ్య, పూర్ణ, నయ్యద్ లతీఫ్, వెంకట రావు తదితరులు పాల్గొన్నారు.

