చట్టాల పై అవగాహనతో మందుల అమ్మకాలు సాగించాలి.– ఔషధ నియంత్రణ శాఖ సహాయ సంచాలకులు వి.యస్ జ్యోతి.– నూతన డిఐ పి. శ్రీరామ్మూర్తి కి స్వాగతం.– బదిలీపై వెళ్లిన డిఐ పి భ్రమర సంధ్య కు వీడ్కోలు

ప్రకాశం జిల్లా ఒంగోలు రీజియన్ నూతన డ్రగ్ ఇన్ స్పెక్టర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన పి. శ్రీరామ్ మూర్తి కి స్వాగతం పలుకుతూ, బదిలీపై జమ్మల గూడెం వెళ్లిన డ్రగ్ ఇన్స్పెక్టర్ పి భ్రమర సంధ్య వీడ్కోలు తెలుపుతూ స్థానిక గుంటూరు రోడ్డులోని పద్మావతి ఫంక్షన్ హాల్ లో ప్రకాశం జిల్లా డ్రగ్స్ అసోసియేషన్ మరియు అనుబంధ ఒంగోలు రిటైల్ మెడికల్ అసోసియేషన్, అసోసియేషన్ మరియు పి సి డి అసోసియేషన్ ఏర్పాటుచేసిన సమావేశంకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఔషధం నియంత్రణ శాఖ సహాయ సంచాలకులు వి ఎస్ జ్యోతి మాట్లాడుతూ ప్రతి ఒక్క కెమిస్ట్ ప్రభుత్వం రూపొందించిన ఔషధ చట్టాలను అవగాహన చేసుకుని మందులు అమ్మకాలు సాగించాలని, ప్రజలకు యాంటీబయాటిక్స్ మరియు నార్కోటిక్ డ్రగ్స్ అమ్మకాలు సాగించేటప్పుడు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ పై అమ్మాలని అంతేకాకుండా ఆ రోగికి ఎంతవరకు ఆ మందు అవసరము అనేది నిర్ధారణ చేసుకోవాలని డ్రగ్ డిపార్ట్మెంట్ సూచించిన సూచనలను తూచా తప్పకుండా పాటించాలని హితబోధ చేశారు.
నూతన డ్రగ్ ఇన్స్పెక్టర్ పి శ్రీరామ్ మూర్తి మాట్లాడుతూ ఔషధ నియంత్రణ శాఖ ప్రజలకు సరైన మందు సరైన పద్ధతిలో మందులు షాపుల ద్వారా అమ్మకాలు కొనసాగించేందుకు రూపొందించిన విధివిధానాలను పాటించాలని తెలిపారు. బదిలీపై వెళుతున్న పి భ్రమరసంధ్య మాట్లాడుతూ ఈ ఐదున్నర సంవత్సరాల కాలంలో ఒంగోలు రీజియన్ లోని ఔషధ దుకాణదారులందరూ చాలా చక్కగా తమ వ్యాపారం కొనసాగిస్తూ డిపార్ట్మెంట్ వారి సూచించిన రూల్స్ ను పాటించారని, కరోనా సమయంలో కూడా ప్రభుత్వానికి సహకరిస్తూ ప్రజలకు మందులు అందించారని గుర్తు చేశారు.
జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు ప్రణీత్ అధ్యక్షతన జరిగిన యాంటీబయోటిక్స్ నార్కోటిక్ డ్రగ్స్ నియంత్రణ నివారణ సమావేశంలో రాష్ట్ర కెమిస్ట్ మరియు డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డి కృష్ణారెడ్డి మరియు జిల్లా అసోసియేషన్ అనుబంధ సంఘాల కార్యవర్గ సభ్యులు మరియు రీజియన్ లోని మందుల వర్తకుల ప్రతినిధులు యజమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమావేశమును జయప్రదం చేశారు. కార్యక్రమానికి మాస్టర్ ఆఫ్ సెర్మినిగా పి శ్రీధర్ వ్యవహరించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *