బేగంపేట జులై 20 (జేఎస్ డిఎం న్యూస్)
ఆదివారం ఆషాడ బోనాలు జాతర సందర్భంగా బేగంపేట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ భూలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని కూకట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దర్శించుకున్నారు. ఎమ్మెల్యే తో పాటు బేగంపేట కార్పొరేటర్ టి మహేశ్వరి శ్రీహరి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ దాత విశాల్ సుదాం ఎమ్మెల్యేను కార్పొరేటర్ ను శాలువాలతో ఘనంగా సత్కరించారు. పూజలు నిర్వహింప చేశారు.అమ్మవారి తీర్థం ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట బి ఆర్ ఎస్ నాయకులు పి శ్రీహరి పొన్నబోయిన సురేష్ యాదవ్ నరేష్ తదితరులు ఉన్నారు.

