బేగంపేట జులై 20 (జేఎస్ డిఎం న్యూస్) :
బేగంపేట శ్యామ్ లాల్ బిల్డింగ్ లోని నల్ల పోచమ్మ దుర్గాదేవి అమ్మవారి ఆలయానికి బిఆర్ఎస్ నాయకులు పొన్నబోయిన సురేష్ యాదవ్ కుటుంబం వెండి కిరీటాలు శతగోపురాలను అందజేశారు. ఈ సందర్భంగా కొండబోయిన సురేష్ యాదవ్ మాట్లాడుతూ ఆషాడమాసంలో ఆదివారం బోనాల జాతర సందర్భంగా భక్తులను చల్లగా కాచి కాపాడే తల్లి నల్ల పోచమ్మ దుర్గాదేవి అమ్మవారి కి తమ కుటుంబం తరఫున వెండి కిరీటాలు శతగోపురాలను అందించామని అన్నారు. వెండి తో తయారు చేసిన ఆ వస్తువులను ఆలయంలో అందించామని సురేష్ యాదవ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పొన్న బోయిన యాదగిరి యాదవ్, విజయకుమార్ యాదవ్, సురేష్ కుమార్ యాదవ్, శ్రీను కుమార్ యాదవ్ లు ఉన్నారు.
