ప్రజలకు మంచి చేసే కూటమి పాలన పది కాలాలపాటు కొనసాగాలి -రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీయాలి -డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ

ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం పది కాలాల పాటు కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారని దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. సోమవారం జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు, షేక్ రియాజ్ సోమవారం ఒంగోలు డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసారు . ఈ సందర్భంగా దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ లక్ష్మీ మాట్లాడుతూ .. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు , ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గ 15 నెలల కూటమి పాలనలో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ .. విధ్వంసం నుండి వికాసం వైపు అడుగులు వేస్తున్నామని అన్నారు . కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తూ, మంచి ప్రభుత్వంగా ప్రజలందరి దీవెనలు అందుకుంటున్న కూటమి జోరుతో ప్రతిపక్ష వైసిపి ఇక జెండా మూసుకునే రోజులు వచ్చాయని అన్నారు . వైసిపి సోషల్ మీడియా, పేటీఎం బ్యాచ్, సైకో బ్యాచ్ ప్రజలలో కూటమి ప్రభుత్వంపై చేస్తున్న దిగజారుడు ప్రయత్నాలను ప్రతికూటమి కార్యకర్త ఒక సైనికుని వలె తిప్పి కొట్టాలని పిలుపు నిచ్చారు . మన కూటమి అంటే ఒక క్రమశిక్షణ, ఎమ్మెల్యే స్థాయి నేతలనైనా దౌర్జన్యాలు చేస్తే సహించేది లేదని పవన్ కళ్యాణ్ శ్రీశైలం ఘటనలో మనకు ఆదేశాలు ఇచ్చినట్లు నిరూపించారని అన్నారు . ప్రతి కార్యకర్త ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం, రాబోయే తరాలను బాగు చేసే స్ఫూర్తితో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు . గత వైసీపీలో విధ్వంసం చూసాం, ఇప్పుడు వికాసం చూస్తున్నామని అన్నారు . సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తూ రాజధాని, పోలవరం నిర్మాణం పూర్తి చేస్తూ.. …. ప్రకాశంలో వెలుగొండను ముందుకు తీసుకు వెళుతూ…… స్త్రీలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని స్త్రీ శక్తి పేరిట ఉచిత బస్సు, దీపం టు పథకం అమలు చేస్తూ డీఎస్సీ ద్వారా నిరుద్యోగ యువతకు ఊతమిస్తూ , ఆంధ్ర రాష్ట్రం నుండి వెనుకడుగు వేసిన పరిశ్రమలను తిరిగి రప్పిస్తూ మన కూటమి ప్రభుత్వం జన రంజక ప్రభుత్వంగా ముందుకు సాగుతుందని తెలిపారు . కూటమి ప్రభుత్వ పాలనలో అభివృద్ధి లో భాగమైన ఒంగోలు నగర అభివృద్ధికి రియాజ్ కృషి ఎంతో మేలు చేస్తుందని అన్నారు . కూటమి ప్రభుత్వాన్ని ఆదరించాలి, అభిమానించాలి కలిసికట్టుగా కూటమి పార్టీలన్నీ ప్రతిపక్ష కుల మతాల చిచ్చును అధిగమించి అరాచకానికి వ్యతిరేకంగా ప్రజలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ఆనందంగా జీవించే పాలన రాబోయే 20 ఏళ్లు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంకుంటున్నానని అన్నారు . కార్యక్రమం లో…ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాస రెడ్డి , ఒంగోలు ,కనిగిరి శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ , డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహా రెడ్డి , ఒంగోలు మేయర్ గంగాడా సుజాత జిల్లాలోని ప్రముఖ నాయకులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *