ప్రకాశం జిల్లా సీనియర్ సాఫ్ట్ బాల్ మహిళా జిల్లా జట్టుకు ఎంపిక ప్రక్రియ మద్దిపాడు మండలంలోని ఏడు గుండ్లపాడు వద్దగల శ్రీ హర్షిని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం ఎంపిక ప్రక్రియ జరిగింది. ఈ ఎంపికలో ముండ్లమూరు మండలంలోని ఉమామహేశ్వరపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినిలు ఎంపికయ్యారు. ఎంపిక అయిన వారిలో బి భావన( పదవ తరగతి) బి కీర్తన( పదవ తరగతి) బి భాగ్యశ్రీ( ఎనిమిదవ తరగతి) సిహెచ్ హరి ప్రియా( ఎనిమిదవ తరగతి) ఎన్ ప్రణతి( తొమ్మిదవ తరగతి) జి తేజస్విని( తొమ్మిదవ తరగతి) సిహెచ్ మాధురి( తొమ్మిదవతరగతి) బి భవాని( ఏడవ తరగతి) విద్యార్థినిలు ఎంపికైనారు. ఎంపికైన విద్యార్థులను ప్రధానోపాధ్యాయురాలు జి మాధవి, వ్యాయామ ఉపాధ్యాయులు పి తిరుపతి స్వామి, ఉపాధ్యాయులు అభినందించారు.
