ఎరువుల దుకాణాలపై నిరంతర నిఘా ఉంచనున్నట్లు వ్యవసాయాధికారి ప్రసాద రావు తెలిపారు. మండలంలోని తూర్పుగంగవరంలో గ్రామోర్ కేంద్రంలో ఎరువుల నిల్వలను, తూకాలను వ్యవసాయాధికారి, టాస్క్ ఫోర్సు సిబ్బంది సోమవారం పరిశీలించారు. అందులో 52.63 మెట్రిక్ టన్నులు, శ్రీలక్ష్మి వెంకట రమణలో 40.91, శ్రీ శ్రీనివాస ఫెర్టిలైజర్స్‌లో 104.2 మెట్రిక్ టన్నుల ఎరువులు నిల్వ ఉన్నట్లు తెలిపారు. నిల్వలను ప్రతి రోజు నమోదు చెయ్యాలని కోరారు. యూరియా కొరత లేదని, ఉన్నట్లు బ్లాక్ మార్కెట్ చేసుకోవాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. కార్యక్రమంలో టాస్క్ పోర్సు, పోలీస్ సిబ్బంది రాములు, మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు.
