నూతనంగా మార్కాపురం జిల్లా ఏర్పాటులో ప్రకాశం జిల్లాలో ఉన్న తాళ్లూరు, ముండ్లమూరు మండలాలను ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలని తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు తాళ్లూరు, ముండ్లమూరు ప్రజా ప్రతినిధులు, నాయకులు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాను కోరారు. ఒంగోలులో సోమవారం ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి ని, స్పందన హాల్ లో జిల్లా కలెక్టర్ ఎ తమీమ్ అన్సారియాను కలిసి విన్నతి పత్రం అందించారు. దర్శి నియోజక వర్గంలోని తాళ్లూరు, ముండ్లమూరు మండలాలు ఒంగోలు రెవిన్యూ డివిజన్లో ఉన్నాయని, దొనకొండ, కురిచేడు, దర్శి మండలాలు కనిగిరి రెవిన్యూ డివిజన్లో ఉన్నాయని అన్నారు. ముండ్లమూరు, తాళ్లూరు మండలాలో ఒంగోలుకు 40 కి.మీల లోపు ఉండగా, మార్కాపురం 70 కి.మీల మేర సుదూరం అవుతుందని చెప్పారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, తాళ్లూరు టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, తాళ్లూరు, ముండ్లమూరు మాజీ అధ్యక్షులు ఓబులు రెడ్డి, సోమేపల్లి శ్రీను, క్లస్టర్ ఇన్చార్జి వెంకట రావు, నవులూరి విద్యాసాగర్, పిన్నక రమేష్ తదితరులు పాల్గొన్నారు.

