ప్రకాశం జిల్లా కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పొదిలిలో నిర్వహించిన కాట్వా ఆత్మీయ సమావేశంలో కురిచేడు మండలం పడమర గంగవరం గ్రామానికి చెందిన కాపు నేత కాకర్ల కాశయ్యను కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. వెలుగొండ శ్రీకృష్ణదేవరాయ కాపు అన్నదాన సత్రం కార్యనిర్వాహక సభ్యులుగా వెంకటేశ్వర స్వామి వారికి సేవలు అందిస్తూనే, వందలాదిమంది కాపు హృదయాలను కదిలించి, కాపు కుటుంబీకుల అందరి సహకారంతో వెలుగొండ శ్రీకృష్ణదేవరాయ కాపు అన్నదాన సత్రాన్ని రాష్ట్రంలోనే నంబర్ వన్ గా నిలిపేందుకు నిరంతరం కృషి చేస్తున్న కాపు నేత కాకర్ల కాశయ్య సేవలను గుర్తించి కాట్వా ఆధ్వర్యంలో పూలమాలలతో శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కాట్వా సభ్యులకు కాశయ్య కృతజ్ఞతలు తెలియజేసి, జీవితాంతం శ్రీకృష్ణ దేవరాయ కాపు అన్నదాన సత్రానికి తన సేవలు అందిస్తానని తెలియజేశారు.

