రైతుల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం -జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు

      రైతుల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు 

చెప్పారు. శనివారం ఆయన పొదిలి మండలం దొండ్లేరు గ్రామంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ పొలాలను సమగ్రముగా సర్వే చేసి ఖచ్చితమైన హద్దులతో పాస్ పుస్తకాలను ప్రభుత్వం ముద్రించిందన్నారు. వీటిని రైతులకు పంపిణీ చేసే ప్రక్రియను ఆదివారం నాటికి ముగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పాస్ పుస్తకంలో ముద్రించిన వివిధ అంశాలను రైతులకు స్వయంగా కలెక్టర్ ఈ సందర్భంగా వివరించారు. హక్కుదారుని
పేరు, భూమి స్వభావము, విస్తీర్ణము, దాన్ని తెలిపేలా మ్యాపును పొందుపరిచిన తీరును, క్యూఆర్ కోడ్ ద్వారా వీటిని తెలుసుకునే విధానాన్ని ఆయన చెప్పారు. కలెక్టర్ వెంట తహసిల్దార్ ఎం.వి.కృష్ణారెడ్డి,
ఇతర అధికారులు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *