నూతన జిల్లా మార్కాపురం జాయింట్ కలెక్టర్ గా పులి శ్రీనివాసులు నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా విధులను నిర్వర్తిస్తున్నారు. గతంలో ప్రకాశం జిల్లా డిఆర్ఓ గా కూడా విధులు నిర్వహించి ఉన్నారు. మార్కాపురం జిల్లా ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రోనంగి గోపాలకృష్ణను రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీగా నియమిస్తూ బదిలీ చేశారు .
