తాళ్లూరు ఎస్సీ కాలనీ సమీపంలో పెద్ద బంకు ప్రాంతంలో ఇరువురు మైనర్లు మోటార్ సైకిళ్లపై వేగంగా వెళ్లూ ఓ వృద్ధుడిని ఢీ కొట్టారు. దీంతో ఆయన ప్రాధమిక చికిత్స అనంతరం ఒంగోలు రిమ్స్ కు తరలించగా అక్కడ మృతి చెందాడు. వివరాలలోనికి వెలితే …. తాళ్లూరు ఎస్సీ కాలనీకి చెందిన మందా చిన్నా (63) అను ట్రాన్స్ జెండర్ తాళ్లూరులోనికి వస్తుండగా, కాలనీ వైపు వేగంగా ఇరు బైక్లపై వెళ్లున్న మైనర్ యువకులలో ఒక బైక్ అకస్మాత్తుగా వృద్ధుడిని ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన వృద్ధుడిని స్థానిక ఆర్ ఎం పీ వద్ద చికిత్స చేయించి, ఒంగోలు రిమ్స్ కి తరలించగా అక్కడ మృతి చెందాడు. మైనర్లు వేగంగా బైక్ లు నడపటం పట్ల సర్వదా విమర్శలు వినిపిస్తున్నాయి.
