తాళ్లూరు మండల కేంద్రంలో వెంకట రామయ్య స్వామి ఆలయం సమీపంలో కోడి పందేలు యధేచ్ఛగా సాగాయి. ముందుగా కోడి పందేలు నిర్వహిస్తున్నారనే సమాచారంలో తాళ్లూరు ఎస్సై మల్లిఖార్జున రావు కోడి పందేల బరులను ద్వంసం చేయించారు. అయితే ఆ తర్వాత ఎటువంటి ఉన్నత స్థాయి ఒత్తిడిలు ఉన్నావో తేలియదు కాని ఎకంగా టి డిపి అభిమానులు స్వాగత ప్లక్సీలు సైతం ఏర్పాటు చేసి పోటీలు నిర్వహించారు. దీంతో అధిక సంఖ్యలో కోడి పెందెం రాయుళ్లు ఆ ప్రాంతంలోనికి చేరుకుని ఉత్సాహంగా కోడి పందేలు చూసారు. కోస్తా ప్రాంతంతో పాటు, చీమకుర్తి ప్రాంతంలో కూడ గతంలో నుండి కోడి పందేలు నిర్వహిస్తుండటంతో ఆ విషయాలను ఆచూకిగా చూపి ఈ ప్రాంతంలో కూడ కోడి పందేలు నిర్వహించాలని అధికారపార్టీ నాయకులపై ఓత్తిడి రావటంతో కోడి పందేలు నిర్వహించినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికి కోడిపందేలు నిర్వహణపై కఠిన చర్యలు తప్పవంటూ పోలీసులు ప్రచారం చేసి, ప్రకటనలు గుప్పించి తీరా కూత వేటు దూరంలో కోడి పందేలు జరుగుతున్నా కన్నేత్తి చూడకపోక పోవటంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
