బోయినపల్లి జనవరి 15,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
బోయిన్ పల్లి లో ప్రసిద్ధి చెందిన న్యూ సిటీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా గోదా రంగ నాయక స్వామి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఆలయంలో ముప్పైరోజుల పాటు పాశురాల అను సంధాన కార్యక్రమం నిర్వహించారు. ధనుర్మాసం నెలాఖ రులో గోదారంగనాయకుల స్వామి కల్యాణోత్స వాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.గోదాదేవిల దివ్య కల్యాణం సాయంత్రం అత్యంత ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు పవన్ స్వామి నేతృత్వంలో అర్చకులు, వేదపండితుల బృందంవివాహమహోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యుల దంపతులు కన్యాదాతలుగా వ్యవహరించారు. కల్యాణ మహోత్సవం లో నమో వెంకటేశా జై శ్రీమన్నరాయణ అనే నామ స్మరణా లతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా కంటోన్మెంట్ బోర్డ్ మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ దంపతులు, బోర్డ్ నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మద మల్లి కార్జున్ పూజలో పాల్గొన్నారు. కీర్తనలు ఆలపించారు. ఆధ్యాత్మిక ఐక్యతను వీక్షించి భక్తులు పునీతులు లయ్యారు కళ్యాణం అనంతరం భక్తులకు అన్నదాన సంతర్పణ చేశారు.

