ఊరంతా సంబరం – విందు వినోదం- భక్తి శ్రర్థలతో సాగిన పార్వేట, రథోత్సవాలు

సంక్రాంతి, కనుమ వేడుకలను జిల్లాలో కన్నుల పండువగా నిర్వహించారు. ఒంగోలులో కను సందర్భంగా శుక్రవారం పార్వేట ఉత్సవం ఘనంగా జరిగింది. వివిధ ఆలయాల నుండి దేవతా మూర్తులను ఊరేగింపుగా తీసుకువచ్చారు. వేలాది మంది పార్వేట లో పాల్గొని స్వామి వార్లను దర్శించుకున్నారు. పలు చోట్ల తెప్పోత్సవాలు నిర్వహించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

విందు .. వినోదం ..

కమనీయ జీవితానికి కనుమ పండుగ నాంది కావాలని కాంక్షిస్తూ ఊరు వాడా సంబరాలు నిర్వహించారు. జిల్లాలో గురువారం మకర సంక్రాంతి, శుక్రవారం కనుమ పండుగ సందర్భంగా ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహంగా సాగాయి. మనుపెన్నడూ లేని విధంగా యదేచ్చగా కోడి పందేలు సాగాయి. రంగ వల్లుల పోటీల్లో ప్రతిభ చాటిన మహిళలకు బహుమతులు అందజేసారు. సూర్యడి మరక రాశిలోకి ప్రవేశించిన సందర్భంగా జిల్లాలోని ప్రముక ఆలయాల్లో పార్వేట ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామి వార్లను దర్శించుకున్నారు.

ఒంగోలులో రంగారాయుడు చెరువులో జరిగిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి తెప్పోత్సవం పూజా కార్యక్రమాలు కనులు పండువగా జరిగాయి. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన రావు, ఓడా చైర్మన్ షేక్ రియాజ్, ఒంగోలు వ్యవసాయ మార్కేట్ కమిటీ చైర్మన్ రాచగొర్ల వెంకట రావులు తెప్పోత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *