పేరు శాంతి ర్యాలీ …. ఫ్లెక్సీలు బి ఆర్ ఎస్ నేతలవి….ప్రజలను తప్పుదారి పట్టించేందుకే బి ఆర్ ఎస్ యత్నం….సీనియర్ కాంగ్రెస్ నేతలు విశాల్ సుధాం,త్రికాల మనోజ్ .

బేగంపేట జనవరి 17, (జే ఎస్ డి ఎం న్యూస్) :
శాంతి ర్యాలీ పేరు పెట్టీ ఫ్లెక్సీలు మాత్రం బి ఆర్ ఎస్ నేతలవి ఏర్పాటు చేసుకుని సికింద్రాబాద్ ప్రజలను బి ఆర్ ఎస్ నేతలు తప్పు దారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని సీనియర్ కాంగ్రెస్ నాయకులు విశాల్ సుధాం, త్రికాల మనోజ్ కుమార్ ముదిరాజ్,పాండు గౌడ్,కృష్ణ ముదిరాజ్ ,నసీరుద్దీన్ తదితరులతో కల్సి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో బి ఆర్ ఎస్ నేతలను ప్రశ్నించారు.ఇటీవల సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని మరికొందరు బి ఆర్ ఎస్ నేతలు సికింద్రాబాద్ పేరు లేకుండా చేస్తున్నారంటూ ప్రచారం చేస్తూ ప్రజలను తప్పు దారి పట్టిస్తున్నారని అన్నారు.దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉంటే చూపాలని వారు డిమాండ్ చేశారు.తమ కుటుంబానికి సికింద్రాబాద్ కు సన్నిహిత మైన సంబంధం ఉందని విశాల్ అన్నారు.సికింద్రాబాద్ పైన బి ఆర్ ఎస్ చేస్తున్న అసత్య ప్రచారాన్ని చేస్తూ రాజకీయంగా వారి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు.సికింద్రాబాద్ కు అన్ని వర్గాల మద్దతు తెలియ జేస్తున్నాయంటూ బి ఆర్ ఎస్ ఫ్లెక్సీలు వేసుకోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.ఇలాంటి అసత్య ఆరోపణలు మానుకోవాలని వారు తెలియ జేశారు. ఈ సమావేశంలో పాండు గౌడ్,కృష్ణ ముదిరాజ్,నసీరుద్దీన్ (అడ్డూ),చిరంజీవి,నారాయణ,శేఖర్,రాజేష్ కుమార్,తదితరులు ఉన్నారు.
సి ఎం రేవంత్ రెడ్డి పై చేసిన అనుచిత వ్యాఖ్యల పై తలసాని క్షమాపణలు చెప్పాలి…
ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన అనుచిత వ్యాక్యాలపట్ల ముందుగా ఆయన క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ నాయకులు విశాల్ సుధాం, త్రికాల మనోజ్ కుమార్ తదితరులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలను ప్రతి ఒక్కరు తప్పు పట్టినా, ఇంతవరకు సీఎంకు ఆయన క్షమాపణ చెప్పకపోవడం ఆయన విజ్ఞతను తెలియ జేస్తుందన్నారు. సీఎంకు తలసానికి క్షమాపణలు చెప్పేవరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటామని వారు తెలియజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *