(జే ఎస్ డి ఎం న్యూస్) పౌష్టికాహారం తీసుకోవడం వల్ల విద్యార్థుల శారీరక ఎదుగుదలకు ఎంతో దోహదపడుతుందని మొండా మార్కెట్ సీఐ రామ్ చందర్ అన్నారు. శనివారం ప్రభుత్వ ఆదాయం మెమోరియల్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఇన్స్పెక్టర్ రామచందర్ స్టీల్ ప్లేట్లను పంపిణీ చేశారు. పాఠశాలకు రాకుండా ఉంటే చెడు అలవాట్లు గురయ్యా అవకాశం ఉందని అలా కాకుండా ఉండాలంటే ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలను పాఠశాలకు పంపాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజనం ఎన్నో పోషకాలు కలిగిన పౌష్టికాహారం అని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బాలాజీ భవాని జిహెచ్ఎంసి సూపర్వైజర్ సాల్మన్ తదితరులు ఉన్నారు.
