రాష్ట్రంలో తుగ్లక్ ప్రభుత్వం ఉంది…..ఎమ్మెల్యే తలసాని.

బేగంపేట జనవరి 16 , (జే ఎస్ డి ఎం న్యూస్) :
ఎన్నికల హామీల ను అమలు చేయడం మరిచి ఊర్లు, పేర్లు మారుస్తామనే తుగ్లక్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. శుక్రవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన సికింద్రాబాద్ ప్రాంత అస్థిత్వాన్ని దెబ్బతీసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. మన అస్తిత్వం, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఈ నెల 17 వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి క్లాక్ టవర్, ప్యాట్నీ, ప్యారడైజ్ సర్కిల్ ల మీదుగా ఎం జీ రోడ్ లోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు శాంతిర్యాలీనిర్వహించనున్నట్లు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ, దక్షిణ మధ్య రైల్వే కార్యాలయం, రాష్ట్రపతి విడిది భవనం, క్లాక్ టవర్ వంటి అనేక చారిత్రక నిర్మాణాలు ఉన్నాయని గుర్తు చేశారు. సికింద్రాబాద్ లో ఆషాడ మాసంలో నిర్వహించే లష్కర్ బోనాలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉందని చెప్పారు. 220 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన సికింద్రాబాద్ ప్రాంత ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా పేరు మారుస్తామంటే ఊరుకోబోమని అన్నారు. సికింద్రాబాద్ జి హెచ్ ఎం సి లోనే ఉన్నదని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సికింద్రాబాద్ ప్రాంతంలోని కొన్ని పోలీస్ సర్కిల్స్, జి హెచ్ ఎం సి సర్కిళ్లను మల్కాజిగిరి పరిధిలోకి మార్చారో చెప్పాలని ప్రశ్నించారు. ఇక్కడ పుట్టి పెరిగిన వారు, ఈ ప్రాంతంతో ఉన్న అనుబంధంతో ఇంటికొకరు చొప్పున ఈ శాంతి ర్యాలీలో పాల్గొని సికింద్రాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఏర్పాటు కోసం జరుగుతున్న పోరాటానికి మద్దతు తెలపాలని కోరారు. ఎన్నికల ముందు ఇచ్చిన తులం బంగారం, మహిళలకు 2500 రూపాయలు వంటి అనేక హామీలు అమలు చేయకుండా ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు.
ర్యాలీలో పాల్గొననున్న కేటీఆర్…. తలసాని.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి నిర్వహించే శాంతి ర్యాలీలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిధిగా పాల్గొంటారని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మన ఆత్మగౌరవం, మన అస్థిత్వాన్ని కాపాడుకునేందుకు, సికింద్రాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఏర్పాటు కోసం ప్రభుత్వం పై గాంధేయ మార్గంలో ఒత్తిడి తీసుకొచ్చేలా నిర్వహించే శాంతి ర్యాలీ లో అన్ని వర్గాల ప్రజలు, వ్యాపార, వాణిజ్య, కార్మిక సంఘాలు, స్వచ్చంద సంస్థలు, మీడియా సంస్థల ప్రతినిధులు పాల్గొనాలని కోరారు. ర్యాలీలో కెటిఆర్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, మాజీ ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటారని చెప్పారు. ప్రెస్ మీట్ లో లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సాదం బాలరాజ్ యాదవ్ తదితరులు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *