పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో సోమవారం విఠలాపురంలో పశువైద్యాధికారి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో పశు వైద్య శిబిరం నిర్వహించారు. నర్పంచి మారం ఇంధ్ర సేనా రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. ఈనెల చివరి వరకు పశువైద్యశిబిరాలు మండలంలో నిర్వహిస్తామని పశువైద్యాధికారి ప్రతాప్ రెడ్డి తెలిపారు. నట్టల నివారణ మందులను, చూడి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి మందుల పంపిణీ చేసారు. వార్డు సభ్యుడు నవులూరి వెంకటాద్రి గోపాల మిత్రలు రోశి రెడ్డి, ఆదినారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


