బేగంపేట జనవరి 19 ,(జే ఎస్ డి ఎం న్యూస్) :
విద్యార్థులు ట్రాఫిక్ సింగిల్స్ పై అవగాహన కలిగి వుండాలని ఛత్రినాక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మోహనరావు అన్నారు.జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా హీరో మోటో కార్స్ ,ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యం లో చార్మినార్ లోని గెలాక్సీ జూనియర్ కళాశాల శాలిబండ విద్యార్థులు రోడ్డు భద్రతపై రోడ్డు భద్రత ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో 150 మంది విద్యార్ధులు ట్రాఫిక్ పోలీస్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో మోటో కార్ప్ నుంచి సాదిక్ సాగర్ మాట్లాడుతూ వాహన దారులు సిగ్నల్ జంపింగ్ చేయరాదన్నారు.మొబైల్ ఫోన్ మాట్లాడవద్దన్నారు.ద్విచక్ర వాహన దారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలన్నారు.కారు నడిపే వారు సీటు బెల్ట్ ధరించాలన్నారు. ఈ ర్యాలీలో షేక్ హుస్సేన్ , సమద్ విద్యారులు పాల్గొన్నారు.


