బేగంపేట జనవరి 20 , (జే ఎస్ డి ఎం న్యూస్) :
ప్రకాశం నగర్ ప్రాంతం పేరును అధికారికంగా ప్రకాశం నగర్ గా ఉపయోగించాలని కోరుతూ విశాల్ సుధాం బేగంపేట్ ఏ సి పి నీ కలసి వినతి పత్రం సమర్పించారు.
కొత్త డీలిమిటేషన్‌ల నేపథ్యంలో ప్రకాశం నగర్ బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చినట్టు పేర్కొన్న ఆయన, పోలీస్ రికార్డులు, బోర్డులు మరియు అధికారిక పత్రాలలో ప్రకాశ్ నగర్ కాకుండా సరైన పేరు వాడాలని కోరారు.
ఈ పేరు ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు స్మారకార్థమని తెలిపారు.ఇక నుంచి అన్ని రికార్డులలో ప్రకాశం నగర్ గా వచ్చేలా చూడాలని ఏ సి పి కి విజ్ఞప్తి చేశారు.విశాల్ వెంట చిరంజీవి,శేఖర్ లు ఉన్నారు.
